గుంటూరు జిల్లా మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లోని ఉపాధిహామీ పథకం బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం వద్ద సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లోని ప్రజలకు 360 రోజులు ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు మాట తప్పిందని ఆరోపించారు.
ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని రైతుల ఆందోళన
గుంటూరు జిల్లా మంగళగిరి - తాడేపల్లి నగరపాలక గ్రామాల రైతులు ఆందోళన చేశారు. ఉపాధి హామీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామి బకాయిలు చెల్లించాలని రైతుల ఆందోళన