ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదగాలి' - గుంటూరులో డొక్కా మాణిక్యవర ప్రసాద్​కు అభినందన సభ వార్తలు

డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన మిత్రులు ఆకాంక్షించారు. డొక్కా వైకాపా ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా గుంటూరులో అభినందన సభ ఏర్పాటు చేశారు.

complimentary program to dokka manikya vara prasad in guntur
డొక్కా మాణిక్య వరప్రసాద్

By

Published : Jun 27, 2020, 3:13 PM IST

వైకాపా ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్​ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గుంటూరులో అభినందన సభ నిర్వహించారు. ఆయన చిన్ననాటి, రాజకీయ స్నేహితులు ఈ కార్యక్రమం చేపట్టారు. డొక్కా మాణిక్య వరప్రసాద్​ భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన మిత్రులు ఆకాంక్షించారు.

నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాలని కోరారు. డొక్కాకు శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details