గుంటూరు జిల్లాలో అత్యధికంగా కోరనా కేసులు నమోదైన నరసరావుపేటలో అధికారులు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నరసరావుపేటలో రేపు, ఎల్లుండి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. నిత్యావసరాల కోసం ఇచ్చే మూడు గంటల వెసులుబాటూ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. గుంటూరులో కేసులన్నీ రెడ్‌జోన్లలోనే నమోదు కాగా.. నరసరావుపేటలో రెడ్‌జోన్లతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నరసరావుపేటలో లాక్డౌన్ మరింత కఠినం - guntur dst narsaraopeta corona cases
గుంటూరు జిల్లాలో అధికారులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గుంటూరు నగరం తర్వాత అత్యధిక కేసులు నమోదైన నరసరావుపేటలో అధికారులు లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నారు.
నరసరావుపేటలో రేపు ఎల్లుండి లాక్‌డౌన్ మరిం కఠినం