ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు - sand smuggling in Guntur News

వినుకొండ మండలంలోని పిట్టంబండ గ్రామం గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని.. గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ గ్రామ ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా.. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు
ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు

By

Published : Jun 18, 2021, 10:56 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని పిట్టంబండ గ్రామం గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని.. గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో వైకాపా నాయకులు కొందరు గుండ్లకమ్మ నదిలో 20 నుంచి 30 అడుగుల లోతు వరకు ఇసుక తీసి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇసుక రీచ్ కోతల కారణంగా దూడలు పడి మృతిచెందిన సందర్భాలు ఉన్నాయని వివరించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ గ్రామ ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా... ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్​కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమకు ఫోన్ చేసి కొందరు బెదిరిస్తున్నట్లు తెలిపారు. అక్రమ ఇసుక రీచ్​లు మూసివేయించాలని కోరారు. ఫోన్​లో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై వినుకొండ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండీ... ప్రత్యేక హోదా: 'పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదు'

ABOUT THE AUTHOR

...view details