ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై పోలీసులకు ఫిర్యాదు - మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై కేసు నమోదు

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై... మంగళగిరి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

complaint filed on mangalagiri mla alla ramakrishna reddy
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు

By

Published : Dec 30, 2019, 5:59 PM IST

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఐకాస నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారితో ధర్నాలు నిర్వహిస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆదివారం వ్యాఖ్యానించారు. దీనిపై మంగళగిరి ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్ కోసం నిరసనలు చేస్తున్న రైతులను కించపరిచేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. మంగళగిరిలో రైతులు రోడ్లపైకి వస్తుంటే ఎమ్మెల్యే ఆర్కే ఒక్కసారైనా వచ్చి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన ఆయన ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details