తెనాలిలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ
లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో 250 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ
కరోనా ప్రభావంతో నిరాశ్రయులైన నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 23 రకాల నిత్యావసర సరుకులను 250 కుటుంబాలకు అందజేశారు. ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని జనసైనికులు పిలుపునిచ్చారు.