ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో కోవిడ్ కేర్ సెంటర్​ను సందర్శించిన కమిషనర్ - నరసరావుపేట కోవిడ్ కేర్ సెంటర్​

గుంటూరు జిల్లా నరసరావుపేట టిడ్కో గృహాల్లోని కోవిడ్ కేర్ సెంటర్​ను మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి పరిశీలించారు. కరోనా బాధితులతో మాట్లాడి.. వారి సమస్యలు తెలుసుకున్నారు.

 Commissioner visits Kovid Care Centre in Narasaraopeta
నరసరావుపేటలో కోవిడ్ కేర్ సెంటర్​ను సందర్శించిన కమిషనర్

By

Published : May 12, 2021, 8:17 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్​ను మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి సందర్శించారు. ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్​లో చికిత్స పొందుతున్న వారితో ఆయన మాట్లాడారు.

అధికారులు ప్రతి రోజూ మూడు పూటలా భోజనం, స్నాక్స్ అందిస్తున్నారా, భోజనం బాగుంటుందా, బాధితులకు సిబ్బంది సకాలంలో మందులు ఇస్తున్నారా అనే అంశాలపై బాధితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కేర్ సెంటర్ అధికారులకు కోవిడ్ అనుమానిత బాధితులకు అందించాల్సిన పలు సలహాలు, సూచనలపై, అధికారులు నిర్వహించాల్సిన పనులపై ఆయన పలు సూచనలు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details