ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు - fertilizer stores latest news update

గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని విభాగాలు పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, పురుగుల మందుల కేసులు వెలుగు చూడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Commissioner of Agriculture officers checking
ఎరువుల దుకాణాల్లో వ్యవసాయశాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

By

Published : Jun 30, 2020, 5:43 PM IST

Updated : Jun 30, 2020, 6:13 PM IST

నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరిందని... అక్కడ విధులు నిర్వహించటం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.

నకిలీ విత్తనాలు, పురుగుల మందులు ఎక్కువగా జిల్లాలో వెలుగు చూస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై పోలీసు కేసులతో సరిపెట్టకుండా వ్యవసాయశాఖ తరపున కూడా చర్యలు తీసుకుంటామన్నారు. వారి లైసెన్సులు సైతం రద్దు చేసే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆయన.. అప్పుడే నకిలీలను అరికట్టడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

Last Updated : Jun 30, 2020, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details