గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం 11 వార్డు దేవుడిమాన్యానికి చెందిన కోలాటి భాను ప్రసాద్ శవపేటికలు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో మార్చురీ బాక్స్ తీసుకొని ఆటోలో వెళ్తుండగా మార్గమధ్యలో హనుమంతరావు కాలనీ ఆర్చి వద్ద రోడ్డుపై కొందరు ఆకతాయిలు భానుప్రసాద్‌ను అడ్డుగించి అసభ్యకరంగా మాట్లాడారు. ఆ సమయంలో అక్కడున్న పెద్దలు సర్ది చెప్పి పంపించివేశారు. అనంతరం భాను ప్రసాద్ ఇంటికి వెళ్లిన 10 నిమిషాలకు సుమారు 20 మంది యువకులు అతడి ఇంటిపైకి వెళ్లి కులం పేరుతో దూషించటమే కాకుండా భానుప్రసాద్‌ను, అతని భార్య రాహేలును, పిల్లలను కొట్టి అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనలో భాను ప్రసాద్, రాహేలుకు గాయాలయ్యాయి. బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాత్రి సమయంలో ఇంటికే వచ్చి…ఎస్సీ కుటుంబంపై దాడి - undefined
రాత్రి సమయంలో కొందరు యువకులు ఓ ఎస్సీ కుటుంబంపై దాడికి దిగారు. వారిని కులం పేరుతో దూషించి… దాడి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది.
రాత్రి సమయంలో ఇంటికే వచ్చి…ఎస్సీ కుటుంబంపై దాడి