గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్న వీఆర్డీఎల్ ల్యాబ్‌ను.. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. ల్యాబ్‌కు అందిన నమూనాలను ఎప్పటికప్పుడు పరీక్షించి ఫలితాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సిబ్బందికి సూచించారు. 104 కాల్ సెంటర్ ద్వారా సేకరించిన నమూనాలకు.. పరీక్షల్లో అధిక ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చూడాలని.. పరీక్షలు వేగవంతంగా చేపట్టేందుకు అవసరమైన సిబ్బందిని పెంచుకోవాలని సూచించారు.
వీఆర్డీఎల్ ల్యాబ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్
గుంటూరు ప్రభుత్వ కళాశాలలో.. కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహిస్తున్న వీఆర్డీఎల్ ల్యాబ్‌ను జిల్లా పాలనాధికారి వివేక్ యాదవ్ పరిశీలించారు. ల్యాబ్‌కు అందిన నమూనాలను పరీక్షించి.. 24గంటల్లో ఫలితాలను వచ్చేలా చూడాలని సబ్బందికి సూచించారు.
guntur collector vivek yadav