కొవిడ్ కేర్ సెంటర్లలోని కరోనా బాధితులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ... వారి ఆరోగ్యాన్ని నిరంతం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. చిలకలూరిపేట టిడ్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. కరోనా బాధితుల రిజిస్టేషన్, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు తదితర వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న భోజన, మంచినీటి సదుపాయాలను పరిశీలించారు.
కొవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్ వివేక్‌యాదవ్ - చిలకలూరి పేట కొవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ వివిక్ యాదవ్
చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌ను కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. కరోనా బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కొవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్ వివేక్ యాదవ్