గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈనెల 15 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. ఈ విషయాన్ని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
రిక్రూట్మెంట్కు సంబంధించి బందోబస్తు నిమిత్తం ట్రాఫిక్ పోలీసు, లా & ఆర్డర్ పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ లో పాల్గొనే అభ్యర్థులు.. నియమ నిబంధనలు తప్పక పాటించాలని, ఆర్మీ సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని ఎస్పీ సూచించారు.