గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ, పమిడిమర్రు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా, ఆరోగ్య కేంద్రం, సచివాలయాలను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో కావాల్సిన మరిన్ని అవసరాలపై ఆరా తీశారు. ప్రజలు ఎక్కువగా ఎలాంటి సమస్యలపై సచివాలయానికి వస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, తహసీల్దార్, ఎంపీడీవో, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ పర్యటన - నరసరావుపేట తాజావార్తలు
గుంటూరు జిల్లా నరసారావుపేట మండలంలోని జొన్నలగడ్డ, పమిడిమర్రులో కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి ఆరా తీశారు.

కలెక్టర్ పర్యటన