గుంటూరు జిల్లా మంగళగిరిలోని VTJM & IVTR డిగ్రీ కళాశాలలో జరిగిన అవకతవకలపై కమిటీని నియమిస్తున్నట్లు కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రకటించారు. మంగళగిరి డిగ్రీ, జూనియర్ కాలేజీలో కలెక్టర్ వివేక్ యాదవ్, శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించారు. కళాశాలలో అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలను వారు పరిశీలించారు. మంగళగిరికి మంజూరైన పాలిటెక్నిక్ కళాశాల తరగతుల నిర్వహణకు తరగతి గదులు ఉపయోగపడతాయా అని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
డిగ్రీ, జూనియర్ కళాశాలకు చెందిన ఖాళీ స్థలాలు అన్యాక్రాంతానికి గురయ్యాయని వీటిలో సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు కమిటీని నియమిస్తున్నామని.. ఆ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.