ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీజీహెచ్​లో బ్రెస్ట్ క్లినిక్​ను ప్రారంభించిన కలెక్టర్ - guntur collector

గుంటూరు జీజీహెచ్​లోని నాట్కోకేర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్లినిక్​ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా డాక్టర్లు, నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు.

జీజీహెచ్​లో బ్రెస్ట్ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్
జీజీహెచ్​లో బ్రెస్ట్ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్

By

Published : Mar 8, 2021, 9:18 PM IST

మహిళలకు రొమ్ము సంబంధిత సమస్యలన్నింటిని పరీక్షించుకోవడానికి, చికిత్స చేయడానికి.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వేదిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గుంటూరు జీజీహెచ్​లోని నాట్కో కేర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్లినిక్​ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మహిళా డాక్టర్లు, నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు.

రొమ్ము సంబంధిత వ్యాధిగ్రస్తులు.. ముందుగానే చికిత్స పొందితే ప్రమాదకర వ్యాధి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మావతి, ప్రొఫెసర్ ఎస్.ఎస్.వి రమణ, డాక్టర్ సుమిత్ర శంకర్, నాట్కో కోఆర్డినేటర్ అశోక్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: శవమై తేలిన పశుసంవర్ధక శాఖ ఏడీఏ

ABOUT THE AUTHOR

...view details