ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్​పై మరింత అవగాహన పెంచాలి' - గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వార్తలు

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్​ను మరింత కట్టుదిట్టంగా నియంత్రించాలని.. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు తమ సహకారం అందించాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కోరారు. కలెక్టరేట్ శంకరన్ హాల్​లో నిర్వహించిన కరోనా అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

'గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్​పై మరింత అవగాహన పెంచాలి'
'గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్​పై మరింత అవగాహన పెంచాలి'

By

Published : Oct 28, 2020, 11:58 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ చెప్పారు. ప్రస్తుతం 5 శాతం పాజిటివిటీ రేటు ఉందని... ఇది పూర్తిగా తగ్గాలంటే మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరముందని తెలిపారు. పరిశ్రమలు ఎప్పుడో ప్రారంభమయ్యాయని.. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. కొవిడ్​పై ప్రచారం పట్టణాలకే పరిమితమైందని... గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. నవంబరు 1 నుంచి ఇంటెన్సివ్ క్యాంపులు నిర్వహిస్తామని... శీతాకాలంలో సెకండ్ వేవ్ పై ప్రచారం నిర్వహిస్తామని శామ్యూల్ ఆనంద్ పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details