పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ పథకానికి సంబంధించి లే అవుట్ల అభివృద్ధి పెండింగ్ పనుల్లో ఉదాసీనత వహించే అధికారులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. జేసీ దినేష్‌కుమార్‌తో కలిసి గుంటూరు, నరసరావుపేట, తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఇళ్ల పథకం లే అవుట్ అభివృద్ధి పనులపై తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల వారీగా ప్రస్తుత స్థితిలో ఉన్న పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్ ఫొటోలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. అభివృద్ధి చేసిన లే అవుట్‌లలో పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి, అవసరమైన ప్రదేశాల్లో లెవలింగ్ చేసి అంతర్గత రహదారులను చదును చేయాలని సూచించారు. అభివృద్ధి పనులను డిసెంబర్ 25 నాటికి పూర్తి చేసి, ఇళ్ల పట్టాల పంపిణికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సి చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, పంచాయితీరాజ్ ఎస్‌ఈ నతానియేల్, కలక్టరేట్ ఏ.ఓ మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.
'ఇళ్ల పట్టాల పంపిణీ' పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష - జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సమీక్ష వార్తలు
ఇళ్ల పట్టాల పంపిణీపై గుంటూరు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేని లే అవుట్లపై సంబంధిత రెవిన్యూ డివిజన్ సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. జేసీ దినేష్‌కుమార్‌తో కలిసి ఇళ్ల పథకం లే అవుట్ అభివృద్ధి పనులపై తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. లే అవుట్ ఫొటోలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందించారు.
ఇళ్ల పట్టాల పంపిణీ పథకం పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష