ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నిర్దేశిత సమయంలో, పారదర్శకంగా అందించేలా విధులు నిర్వర్తించాలని సచివాలయ ఉద్యోగులను గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు. ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ సచివాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. స్థానికంగా ఉన్న పారిశుద్ధ్య సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆ సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సంక్షేమ పథకాలను జవాబుదారీతనంతో అందించాలి: జిల్లా కలెక్టర్ - guntur district latest news
సంక్షేమ పథకాలను జవాబుదారీతనంతో ప్రజలకు అందించాలని సచివాలయ ఉద్యోగులను గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు. ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ సచివాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
సంక్షేమ పథకాలను జవాబుదారీతనంతో ప్రజలకు అందించాలి