గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన షేక్ రెహనా సుల్తానా, ఆజాద్‌ల కుమారుడు తొండూరు రెహజాద్ అహమ్మద్. ఈ బుడతడి వయసు రెండున్నర సంవత్సరాలు. ఈ చిచ్చర పిడుగు అంకెలు, కూరగాయలు, రంగులు, పండ్లు, శరీరభాగాలు, ఇంగ్లీషు పదాలను గుర్తించటంతో పాటు.. రకరకాల జంతువుల అరుపులు అనుకరించటం చేస్తున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వీడియోను రికార్డ్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సుకి పంపారు. ఇందుకుగాను చిన్నారికి ఆ సంస్థ వారు అప్రిషియేషన్ సర్టిఫికేట్, గోల్డ్ మెడల్, గుర్తింపు కార్డు, పెన్, కరెంట్ ఎడిషన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు 2021 పుస్తకంను పంపించారు. ఈమేరకు ఆ చిన్నారితో సహా తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను కలిసి బుడతడు సాధించిన విజయాన్ని తెలిపారు. కలెక్టర్ సైతం చిన్నారి చెబుతున్న పదాలను విని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ రెహజాద్ అహమ్మద్‌ను అభినిందించారు.
talented child: చిన్న వయసులో పెద్ద ఘనత.. - India Book of Records officers appreciated the Pedakakani child
ఓ రెండేళ్ల పిల్లలు.. సాధారణం మనం చెప్పే మాటలను ముద్దు,ముద్దుగా పలుకుతూ ఉంటారు. కాస్త తెలివైన పిల్లలు పండ్లు, కూరగాయలు, జంతువుల చిత్రాలను చూసి పేర్లను చెబుతూ ఉంటారు. ఇంకాస్త తెలివైన చిన్నారులు మనం చెప్పే శ్లోకాలను మననం చేసుకుంటూ.. తిరిగి అప్పజేబుతుంటారు. కానీ ఈ చిచ్చర పిడుగు అక్షరాలతో పాటు పదాలను అలవోకగా చదివేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. అతని ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సైతం అబ్బురపరిచాడు. ఆ అల్లరి పిడుగుకు సంబంధించిన మరికొన్ని సంగతులు..
గుంటూరు కలెక్టర్