ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డుపై లారీ ముందుభాగం.. కాలువలో వెనుకభాగం! - lorry fell down at Peddapulivarru

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద పురాతన వంతెన కూలిపోయింది. బ్లీచింగ్ లోడ్​తో వెళ్తున్న లారీ వెనుకభాగం కాలువలోకి పడిపోయింది. ముందుభాగం రోడ్డుమీదే ఉంది. అధికబరువుతో లారీ వెళ్లడంవల్లే ప్రమాదం జరగిందని స్థానికులు భావిస్తున్నారు.

lorry felldown
పడిపోయిన లారీని చూస్తున్న పోలీసులు

By

Published : May 12, 2021, 5:26 PM IST

రోడ్డు మీద లారీ ముందుభాగం..కాలువలో వెనుకభాగం

గుంటూరు జిల్లాలో వందేళ్ల నాటి పురాతన వంతెన కూలిపోయింది. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద సాగునీటి కాలువ బ్రిడ్జ్ పై.. బ్లీచింగ్ పౌడర్ లోడుతో అవనిగడ్డకు చెందిన లారీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వంతెన కూలిపోగా.. లారీ వెనుక భాగం కాలువలోకి జారిపోయింది. ముందుభాగం మాత్రం రోడ్డుపైనే ఉంది. డ్రైవర్ ఎలాంటి గాయాలు కాకుండా బయపడ్డాడు.

అధిక లోడుతో వెళ్లిన కారణంగానే ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. బ్రిటీష్ హయాంలో నిర్మించిన వంతెనకు ఇటీవలే మరమ్మతులు చేశారు. అవనిగడ్డకు వెళ్లేందుకు వెల్లటూరు మీదుగా వేరే రోడ్డు ఉన్నా దగ్గరి దారి కావడం వల్లే.. డ్రైవర్ ఈ మార్గంలో వెళ్లినట్టు చెప్పాడు. భట్టిప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ ద్వారా లారీని బయటకు లాగేందుకు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details