ఉభయ గోదావరి జిల్ల్లాలో సంక్రాంతి సందర్భంగా.. కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి.ఏలూరు గ్రామీణ ప్రాంతంలోని చాటపర్రు, భీమవరం మండలం పెదగరువు, కాళ్లమండలం సీసలి, ఉండి మండలం ఐ.భీమవరం, పాలకొల్లు మండలం పూలపల్లె,తాడపల్లిగూడెం, తణుకు నిడదవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో పెద్ద బరులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కో పందెం పది లక్షల రూపాయలకుపైగా జరిగింది. జిల్లాలో మొదటిరోజే సుమారు వంద కోట్లరూపాయలకు పైగా కోడిపందేల్లో జూదాలు సాగాయని అంచనా. ఇక చిన్నబరులైతే దాదాపు రెండువందలకుపైనే ఏర్పాటుచేశారు. తిరునాళ్లను తలపించే రీతిలో భారీగా టెంట్లు వేసి పందెంరాయుళ్లను నిర్వాహకులు ఆకర్షించారు.
తూర్పుగోదావరిలోనూ జోరుగా పందేలు నడిచాయి. రావులపాలెంలో జరిగిన పందేలనుఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి స్వయంగా పందేలు ప్రారంభించారు. సినీ దర్శకుడు వి.వి. వినాయక్ కూడా ఇక్కడి పందేలు చూసేందుకు వచ్చారు. ఇక బరులు వద్ద భారీగా జూదాలూ జరిగాయి. గుండాట, మూడుముక్కలాట, కోత ఆట వంటి అనేక రకాల జూద క్రీడలు నిర్వహిచారు.