పుట్టుకతోనే పిల్లలు చెవిటి, మూగవారని తెలిస్తే తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ఇలాంటి పిల్లలకు కాక్లియర్ ప్లాంట్లు అమర్చడం ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు. లక్షలాది రూపాయల ఖర్చుతో కూడిన ఈ శస్త్రచికిత్సలను ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ద్వారా ఓ చెవికి మాత్రమే నిర్వహించేవారు. తాజాగా ప్రభుత్వం రెండు చెవులకూ ఉచితంగానే ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ప్లాంట్ల అమరిక ఆపరేషన్లకు అనుమతి ఇవ్వడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
దేశంలోనే ప్రథమం.. రెండువైపులా ఉచితంగా కాక్లియర్ ప్లాంట్ ఆపరేషన్లు - ఉచిత కాక్లియర్ ఆపరేషన్లు న్యూస్
దేశంలోనే మెుట్టమెుదటిసారిగా రెండువైపులా ఉచితంగా కాక్లియర్ ప్లాంట్ ఆపరేషన్లకు ప్రభుత్వం అనుమతించింది. పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన ఐదుగురు చిన్నారులకు కాక్లియర్ ప్లాంట్ ఆపరేషన్ను గుంటూరులో నిర్వహించారు.
తాజాగా గుంటూరు రాధికా రాయుడు చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రిలో ఒకేసారి ఐదుగురికి కాక్లియర్ ప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించారు అక్కడి వైద్యులు. దేశంలోనే ప్రథమంగా రెండువైపులా ఉచితంగా కాక్లియర్ ప్లాంట్ ఆపరేషన్లకు రాష్ట్రప్రభుత్వం అనుమతించిందని.... ఏడాదిన్నర వయసులోనే పిల్లల్లో వినికిడి దోషాన్ని, మూగతనాన్ని పసిగట్టి వైద్యులను సంప్రదిస్తే వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చే అవకాశముందని చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ సుబ్బారాయుడు చెప్పారు.
ఇదీ చదవండి:తెలంగాణ: నదిలో ప్రమాదకర పడవ ప్రయాణం