ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్దతు ధరల గోడపత్రిక ఆవిష్కరించిన సీఎం - ఏపీ ప్రభుత్వం వార్తలు

రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం పత్రికల ద్వారా ప్రకటించింది. 2020-21 ఏడాదికి మొత్తం 24 పంటలకు ధరలను వెల్లడించింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన గోడ పత్రికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.

cm jagan
cm jagan

By

Published : Oct 1, 2020, 3:47 PM IST

వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల వివరాల గోడ పత్రికను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గురువారం‌ ఆవిష్కరించారు. ఈ నెల 5వ తేదీ కల్లా రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో(ఆర్​బీకే) వీటిని ప్రదర్శించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2020-21 ఏడాదికి సంబంధించి మొత్తం 24 పంటలకు ధరలను ఈ గోడ పత్రికలో పేర్కొన్నారు.

కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్ ‌కుమార్, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details