ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్షేమ పథకాల క్యాలెండర్​ను విడుదల చేసిన సీఎం జగన్ - ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వ పథకాలు

Welfare Schemes Calendar: రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్​ను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఇందులో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ.. ఏ నెలలో ఏ పథకాలు అమలు అవుతాయో తెలుపుతూ క్యాలెండర్​ను విడుదల చేశారు.

Welfare Schemes Calendar
సంక్షేమ క్యాలెండర్

By

Published : Apr 4, 2023, 10:51 PM IST

Updated : Apr 5, 2023, 6:27 AM IST

CM Inaugurates Government Welfare Calendar: 2023–24 ఏడాదిలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ క్యాలెండర్​ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

నెలల వారీగా ప్రభుత్వం అమలుచేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్‌లో పొందుపరిచారు. ఈ నెలలో జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్లు క్యాలెండర్​లో తెలిపారు. మే నెలలో వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ మొదటి విడత, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన మొదటి విడత, వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీ తోఫా, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది జూన్​లో జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. జులై నెలలో జగనన్న విదేశీ విద్యా దీవెన మొదటి విడత, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు మొదటి విడత, స్వయం సహాయక బృందాలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ , వైఎస్సార్‌ కళ్యాణమస్తు – షాదీతోఫా రెండో త్రైమాసికం నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆగష్టులో జగనన్న విద్యా దీవెన రెండో విడత, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాలు అమలు చేయనున్నారు.

సెప్టెంబర్​లో వైఎస్సార్‌ చేయూత, అక్టోబర్​లో వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ రెండవ విడత, జగనన్న వసతి దీవెన మొదటి విడత నిధులు విడుదల చేయనున్నారు. నవంబర్‌లో వైఎస్సార్‌ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు – షాదీతోఫా మూడవ త్రైమాసికం, జగనన్న విద్యాదీవెన మూడవ విడత నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్​లో జగనన్న విదేశీ విద్యాదీవెన రెండవ విడత, జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చనున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ మూడవ విడత, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు రెండవ విడత, వైఎస్సార్‌ లా నేస్తం రెండవ విడత, అమలు సహా పెన్షన్లను నెలకు 3 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాల్గవ విడత , వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా నాల్గవ త్రైమాసికం, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాలు అమలు చేయనున్నారు. మార్చిలో జగనన్న వసతి దీవెన రెండవ విడత, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు నిధులు ఇవ్వనున్నట్లు క్యాలెండర్​లో తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 5, 2023, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details