ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ భద్రత నడమ సచివాలయానికి సీఎం జగన్ - cm jagan update news

సచివాలయానికి వెళ్లే సీఎంను మందడం రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ భారీ భద్రత నడుమ సచివాలయానికి వెళ్లారు.

cm convoy
భారీ భద్రతతో సచివాలయానికి సీఎం జగన్

By

Published : Nov 5, 2020, 1:56 PM IST

ముఖ్యమంత్రి జగన్ భారీ భద్రత మధ్య సచివాలయానికి వెళ్ళారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులు సీఎంను అడ్డుకుంటారనే సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మందడం దీక్షాశిబిరం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 200 మంది కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో.. రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే సీఎం ఒక్కసారైనా తమను చర్చలకు పిలిచారా? అని రైతులు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details