ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీరు బాగోకుంటే తీసేయడానికి వెనుకాడను - conference

"క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి అభ్యర్థులను ఖరారు చేస్తున్నాను. ఖరారు తర్యాత కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నాను. ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం సరిగ్గా లేకుంటే అభ్యర్థులను మార్చటానికి వెనుకాడను." ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

చంద్రబాబు నాయుడు

By

Published : Mar 13, 2019, 11:27 AM IST

Updated : Mar 13, 2019, 3:57 PM IST

చంద్రబాబు నాయుడు
క్షేత్రస్థాయిలో నాణ్యమైన ప్రజాభిప్రాయ సేకరణ చేసి.. అభ్యర్థులను ఖరారు చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థుల ఖరారు తర్యాత కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నానని తెలిపారు. ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం సరిగ్గా లేకుంటే అభ్యర్థులను మార్చటానికి వెనుకాడనని స్పష్టంచేశారు. వాస్తవ పరిస్థితులపై తీసుకుంటున్న ప్రజాభిప్రాయంతో మంచి ఫలితాలు రాబోతున్నాయన్నారు.

16నుంచి ప్రచారం పర్వం మొదలు

మూడు దశల్లో ఎన్నికల ప్రచారం చేపడుతున్నానని తెలిపారు. 16వ తేదీన తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాననీ.. అదే రోజు శ్రీకాకుళంలో పర్యటన ఉంటుందని వివరించారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. రెండో దశలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల్లో పర్యటన ఉంటుందని తెలిపారు. తర్వాతి దశలో కర్నూలు, కడప, అనంతపురంలో పర్యటిస్తానని తెలిపారు. 18 నుంచి లబ్ధిదారులే ముందుకువచ్చి తోచిన విధంగా పార్టీకి ప్రచారం చేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు.

వైకాపా కుట్రను నిలదీయండి

ఫారం-7 దుర్వినియోగంలో అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు తన ఓటే తొలగించే ప్రయత్నం అంటూ జగన్ నాటకం ఆడుతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. మోదీ, కేసీఆర్, జగన్ అనుబంధం మరోసారి బట్టబయలైందనీ.. ఈడీ మాజీ డెరెక్టర్ సీబీఐకి రాసిన లేఖే ఇందుకు నిదర్శనమన్నారు. ఈడీ లేఖపై వైకాపాను నిలదీయాలనీ.. వీరి కుట్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర హక్కును తాకట్టు పెట్టే కుట్రను సహించవద్దనీ... ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని తెలిపారు.

ఇవీ చదవండి..

సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెదేపా మేనిఫెస్టో..!

కొలిక్కి వస్తోన్న కడప తెదేపా అభ్యర్థుల ఎంపిక

Last Updated : Mar 13, 2019, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details