సీఎం సహాయనిధి పేదలకు పెన్నిధిలాంటిదని ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. చిలకలూరిపేట వైకాపా కార్యాలయంలో 203 మంది బాధితులకు రూ36.25 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో వైద్యం కోసం గతంలోలాగా ఇప్పుడు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేదని చెప్పారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
చిలకలూరిపేటలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ - cm relief fund checks distributed by mla vidadala rajini
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే విడదల రజిని.. బాధితులకు అందజేశారు. సీఎం జగన్ పేదల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆమె చెప్పారు.

vidadhala rajini