ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: 31 వరకు తెలంగాణలో విద్యాసంస్థలు బంద్ - cm kcr latest news

కరోనా విస్తృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేస్తామని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. కోచింగ్‌ సెంటర్లు, సమ్మర్‌ క్యాంపులు నడపవద్దని ఆదేశించారు. ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించిన పరీక్షలు మాత్రం యథావిధిగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థల బంద్
రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

By

Published : Mar 14, 2020, 11:08 PM IST

రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

కరోనా వ్యాప్తి నిరోధానికి అన్ని శాఖల అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కొన్నాళ్ల పాటు జనసమ్మర్థం లేకుండా చూసుకోవాలని సూచించారు. మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేస్తామని సీఎం తెలిపారు. ఎలాంటి క్రీడలు, టోర్నమెంట్‌లు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశామన్నారు. సూపర్‌ మార్కెట్లు, మాల్స్ మూసివేయటం లేదని.... నిత్యావసరాల విషయంలో ప్రజలకు ఇబ్బందులు రావొద్దని మాల్స్‌కు అనుమతి ఇస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ సోషల్‌ వెల్‌ఫేర్‌ హాస్టళ్లలో, రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో ఉన్నవారు పరీక్షలు అయ్యేంత వరకు అక్కడే ఉండొచ్చని తెలిపారు. మార్చి 31 తరువాత పెళ్లి మండపాలు బుకింగ్​లు స్వీకరించవద్దని సూచించారు. ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయమై ఉన్నందున అప్పటివరకు అనుమతి ఇచ్చారు. అయితే.. 200 మంది మించకుండా వివాహం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బహిరంగ సభలు, వర్క్‌షాపులు, ర్యాలీలు వంటివి అనుమతించబోరు. జిమ్ములు, పార్కులు, జూ పార్కులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, మ్యూజియం, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, అన్ని రకాల స్పోర్ట్స్‌ ఈవెంట్లు రద్దు చేశారు. సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు కూడా మూసివేస్తారు. ప్రజా రవాణా కోసం ఆర్టీసీ బస్సులు, మెట్రో యథావిధిగా నడుస్తాయి. ప్రజలు కూడా వీలైనంత జనసమ్మర్థ ప్రదేశాలకు దూరంగా ఉండాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వ రెసిడెన్సియల్‌ విద్యార్థులకు హాస్టల్ వసతి కొనసాగుతుంది. వసతిగృహ విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఫంక్షన్‌ హాళ్లు మూసివేయాలని నిర్ణయించాం. ఇప్పటికే నిర్ణయమైన వివాహాలు జరుపుకోవచ్చు. 200 మంది కంటే ఎక్కువ మంది లేకుంటా చూసుకుంటే బాగుంటుంది. మార్చి 31 తర్వాత వివాహాలకు మాత్రం బుకింగ్‌లు తీసుకోవద్దు. బహిరంగసభలు, ర్యాలీలు, జాతరలు, మేళాలకు అనుమతులు ఉండవు. ఇండోర్‌ స్టేడియాలు, జూపార్క్‌లు, మ్యూజియంలు మూసివేస్తాం. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.

- సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి:

మార్చి 16 నుంచి ఆన్​లైన్​ లావాదేవీలు బంద్​!

ABOUT THE AUTHOR

...view details