ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tribute : అల్లూరి చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు - tribute to alluri seetharamaju

సాయుధ పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri seetharamaraju). స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఉరకలెత్తించిన మహనీయుడు. నేడు ఆయన జయంతి(Birth anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి జగన్(CM jagan) అల్లూరి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

CM jaganmohnreddy tribute to alluri seetharamaju in tadeapalli
అల్లూరి చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు

By

Published : Jul 4, 2021, 3:27 PM IST

భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన మన్యం వీరుడు.. అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ పాలకులను ఎదిరించి, భారత స్వాతంత్య్ర చరిత్రలో ఆయన పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయం. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 1924 మే 7వ తేదీన 27 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి.

నేడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి నివాళులు అర్పించారు. తన నివాసంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేశారు. సీఎంతో పాటు మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తదితరులు నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details