CM review on Women and Child Welfare Dept: అంగన్వాడీల్లో పిల్లలకు ఫ్లేవర్డ్ పాలను పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా అందించి తర్వాత పూర్తి స్థాయిలో ఫ్లేవర్డ్ పాలు పంపిణీ చేయాలని సూచించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపిన సీఎం.. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీలలో స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పద్ధతుల్లో బోధన చేసే అంశంపై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం పచ్చజెండా: మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. స్త్రీ శిశు సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం పచ్చజెండా ఊపిన సీఎం.. వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీలలో జరుగుతోన్న నాడు–నేడు ప్రగతిపై చర్చించారు. దాదాపు 1500 కోట్లకు పైగా ఖర్చుచేయాలని, మూడు విడతల్లో నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు.
బాధ్యులు చేసి కచ్చితంగా చర్యలు:అంగన్వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.. పాలు, గుడ్లులాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నారు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ,పరిశీలన ఉండాలన్నారు. సమగ్ర ఎస్‌ఓపీలు రూపొందించుకోవాలని, టెక్నాలజీ వాడుకోవాలని సీఎం ఆదేశించారు. పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే సంబంధిత వ్యక్తులను బాధ్యులు చేసి కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. సూపర్‌వైజర్లపైన పర్యవేక్షణ ఉండాలన్నారు. నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలన్న సీఎం.. పిల్లలకు ప్లేవర్డ్ పాలు పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్నారు. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్ మిల్క్ పంపిణీ కావాలని, ఈ మేరకు షెడ్యూల్ రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు.