ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్చిన హామీల్లో 98.5 శాతం అమలు చేశాం: సీఎం జగన్ - about YSR Rythu Bharosa

YSR Rythu Bharosa in Tenali: తెనాలి నుంచి రైతులకు రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. వరుసగా నాలుగో ఏడాదికి సంబంధించి నిధులు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. రైతులకు ఏటా రూ.13,500 రైతు భరోసా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54 వేలు చొప్పున సాయం అందించామన్నారు. తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు చేసినట్లు సీఎం వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 28, 2023, 4:54 PM IST

ఇచ్చిన హామీల్లో 98.5 శాతం అమలు చేశాం: సీఎం జగన్

YSR Rythu Bharosa in Tenali: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 98.5 శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్​ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్‌ రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. తాము చేసే సంక్షే పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని.. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలు ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తిరుగుతున్నారని జగన్ పేర్కొన్నారు. కరవుతో ఫ్రెండ్‌షిప్‌ ఉన్న చంద్రబాబుకు, వరుణ దేవుడి ఆశీస్సులున్న మనందరికీ వచ్చే ఎన్నికల్లో యుద్ధం జరగనుందని జగన్ పేర్కొన్నారు. ఆ యుద్ధం కులాల మధ్య కాదు.. పేదలు, పెత్తందార్ల మధ్య అని వెల్లడించారు. పొరపాటు జరిగితే రాజకీయాల్లో ఇచ్చిన మాటపై నిలబడటం అనే పదానికి అర్థం లేకుండా పోతుందని జగన్ పేర్కొన్నారు. మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఆ వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడు కాదు అనే పరిస్థితి రావాలని జగన్ వెల్లడించారు.

తాము అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి నాలుగో విడతగా నిధులు విడుదల చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం రూ.12,500 ఇస్తామని చెప్పి.. అంతకన్నా మిన్నగా ప్రతి సంవత్సరం రూ.13,500 ఇచ్చినట్లు జగన్ వెల్లడించారు. ఈ నాలుగో ఏడాదికి సంబంధించి ప్రతి రైతుకు చెల్లించినట్లు తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కీసాన్ కార్యక్రమం ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మెుత్తం 54 వేలు ఇచ్చినట్లు జగన్ పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంతో కలుపుకొని రూ. 67వేల500 రూపాయలు రైతులకు చెల్లించినట్లు అవుతుందని జగన్ పేర్కొన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 27వేల 62కోట్లు రైతలుకు చెల్లించినట్లు జగన్ తెలిపారు. వ్యవసాయం మీద ప్రేమంటే ఇలా ఉంటుందని తెలిపారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ: తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు చేసినట్లు సీఎం వెల్లడించారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోపే పరిహారం అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నాలుగేళ్లలో సమృద్ధిగా వర్షాలు పడి కరవు ఊసే లేకుండా పోయిందని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క కరవు మండలం లేకుండా చేసినట్లు సీఎం జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. మంచి పాలనకు దేవుడి ఆశీర్వచనాలు తోడయ్యాయని జగన్ వెల్లడించారు. మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండాలని మాత్రమే కోరుతున్నట్లు జగన్ తెలిపారు. నిర్ణయం తీసుకునే ముందు అన్నీ గమనించి ఆలోచించాలని జగన్ తెలిపారు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేదే ప్రామాణికంగా తీసుకోవాలని జగన్‌ కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details