CM jagan News: జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ముఖ్యమంత్రి జగన్ తొలిసారిగా ఇవాళ పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు. జిల్లా క్రీడా ప్రాంగణంలో నిర్వహించే వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. హెలీకాప్టర్ ద్వారా ఉదయం 10 గంటల35 నిమిషాలకు ఎస్ఎస్ఎన్ కళాశాల మైదానానికి జగన్ చేరుకుంటారు. పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. 11 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
నేడు నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన.. వాలంటీర్లకు సన్మానం - సీఎం జగన్ వార్తలు
CM Jagan Narasaraopet Tour: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ముఖ్యమంత్రి జగన్.. నేడు పర్యటించనున్నారు. వివిధ ప్రారంభోత్సవాలతో పాటు వాలంటీర్లకు నిర్వహించనున్న సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
అనంతరం వాలంటీర్లకు సత్కార కార్యక్రమం నిర్వహిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు అవార్డుల ప్రదానం చేస్తారు. వాలంటీర్లకు వారి ప్రతిభను బట్టి సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులు అందజేస్తారు. సేవామిత్ర వాలంటీర్లకు రూ. 10వేలు, సేవారత్న వాలంటీర్లకు రూ. 20వేలు, సేవావజ్ర వాలంటీర్లకు రూ. 30వేల చొప్పున అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 28వేల 322 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డుల ప్రదాం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జిల్లాల వారీగా ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వాలంటీర్లకు పురస్కారాలు అందజేస్తారు.
ఇదీ చదవండి:గవర్నర్తో సీఎం జగన్ భేటీ.. రేపు మంత్రుల రాజీనామా !