ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏప్రిల్ 1వ తేదీన గుంటూరు జిల్లాకు రానున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను సచివాలయాల్లో ప్రారంభించటంతో పాటుగా ఆయన గుంటూరు నగరంలోని 140వ సచివాలయంలో వ్యాక్సినేషన్ వేయించుకోనున్నారు. ముఖ్యమంత్రి రాక, కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యే గిరిధర్‌రావు, నగరపాలక సంస్థ మేయర్ మనోహర్‌నాయుడు పరిశీలించారు. ఏప్రిల్ 1వ తేదీన సీఎం జగన్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి మొదటి టీకాను వేయించుకుంటారని మోపిదేవి తెలిపారు.
ఏప్రిల్ 1న కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్
ఏప్రిల్ 1న గుంటూరులో సీఎం జగన్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు భరత్‌పేట వార్డు సచివాలయానికి రానున్న సీఎం... కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
cm jagan will take first dose of Covid vaccin on april 1st