ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజనులకు భూపట్టాల పంపిణీ.. హామీ నిలబెట్టుకున్నామన్న సీఎం - cm jagan latest news

గిరిజనులకు అటవీ హక్కు పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లి నుంచి లబ్దిదారులతో వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గ్రామస్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామన్న సీఎం.. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నామన్నారు.

cm jagan thadepalli
cm jagan thadepalli

By

Published : Oct 2, 2020, 1:00 PM IST

గిరిజనులకు భూపట్టాల పంపిణీ ప్రారంభం.. హామీ నిలబెట్టుకున్నామన్న సీఎం

గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఏడాది నుంచి ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు, సేవలు అందిస్తున్నామని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గిరిజనులకు ఆర్​వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీని ప్రారంభించిన ఆయన.. లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గిరిపుత్రులకు భూముల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర జనాభాలో 6 శాతం ఉన్న గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు లక్షా 53 వేల కుటుంబాలకు 3లక్షల 12 లక్షల ఎకరాలపై హక్కులు కల్పిస్తున్నామన్నారు. నెలరోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు.

గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని.. గ్రామస్థాయికి ప్రభుత్వ సేవలు తీసుకెళ్లామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నామన్న సీఎం..గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు. ఈ రోజు నుంచి అటవీ హక్కు పత్రాల పంపిణీ ప్రారంభిస్తున్నాని స్పష్టం చేశారు. గిరిజనులకు భూమితోపాటు రైతు భరోసా కింద సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ఇవ్వబోతున్నామని ప్రకటించారు.

ఇదీ చదవండి:అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ దంపతులకు కరోనా ​

ABOUT THE AUTHOR

...view details