ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీని నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: సీఎం జగన్‌

CM Jagan Review: నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలని, ఎక్కడా మాదక ద్రవ్యాల వినియోగం కనిపించకూడదని సీఎం జగన్ ఆదేశించారు. ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ శాఖపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలన్న ఆయన, సచివాలయాల మహిళా పోలీస్‌లను ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థంగా అమలు చేయాలని సీఎం నిర్దేశించారు.

cm jagan review
cm jagan review

By

Published : Dec 19, 2022, 8:26 PM IST

CM Jagan Review: రాష్ట్రాన్ని నార్కొటిక్స్‌ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అదేశించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, ఎక్సైజ్‌ శాఖపై సమీక్షించిన ఆయన, నార్కొటిక్స్‌తో పాటు అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడంలో ఎక్సైజ్​, ఎస్‌ఈబీ అధికారులతో పోలీస్‌ శాఖ మరింత సమన్వయంతో పని చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి గురువారం పోలీస్‌ ఉన్నతాధికారులు సమావేశం కావాలని సూచించారు.

ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ 14500తో పాటు, నార్కొటిక్స్‌ నియంత్రణపై అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద పెద్ద హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రాన్ని వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్‌ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. గంజాయి సాగుదార్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలన్న సీఎం.. అక్రమ మద్యం, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించడం, ఇసుక ఎక్కువ ధరకు అమ్మడం, ఇలా దేనిపై ఫిర్యాదు వచ్చినా ఎస్‌ఈబీ అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు.

సచివాలయ మహిళా పోలీస్‌ల పనితీరును మరింత మెరుగుపర్చాలని సీఎం పేర్కొన్నారు. దిశ చట్టం, యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడంపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్దేశించారు. దీనికోసం ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. యాప్‌ డౌన్‌లోడ్స్‌ పెరగాలని, మనం చేసిన పనుల వల్ల అవార్డులు రావాలని పేర్కొన్నారు.

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details