ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి రానున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సల అనంతరం డిశ్చార్జ్ అయ్యే రోగులకు ఆర్థికసాయం అందించే పథకానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా పోలీస్ పరేడ్ మైదానానికి హెలీకాప్టర్ ద్వారా చేరుకోనున్న సీఎం... తర్వాత కాన్వాయ్ ద్వారా గుంటూరు సర్వజనాస్పత్రికి రానున్నారు. అక్కడ ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్స రోగులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. రోజుకు రూ. 225 చొప్పున ఆర్థికసాయాన్ని అందించనున్నారు. అనంతరం జింకానా ఆడిటోరియంలో ఉదయం 11.40 గంటలకు నిర్వహించే సమావేశంలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్, జిల్లా ఎమ్మెల్యేలు పరిశీలించారు. జీజీహెచ్లో రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ పరంగా 600 మందికి పైగా పోలీస్ సిబ్బందిని ఏర్పాట్లు చేశారు.. గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
గుంటూరు జీజీహెచ్లో నూతన పథకం...ఇవాళ ప్రారంభించనున్న సీఎం - గుంటూరులో సీఎం పర్యటన
గుంటూరులో నేడు సీఎం జగన్మోహాన్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆరోగ్య శ్రీ పథకం కింద శస్త్రచికిత్స అనంతరం... రోగులకు విశ్రాంతి సమయంలో అందించే ఆర్థిక సాయం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
![గుంటూరు జీజీహెచ్లో నూతన పథకం...ఇవాళ ప్రారంభించనున్న సీఎం cm-jagan-visiting-on-guntur-for-opening-a-new-scheem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5239121-thumbnail-3x2-jaganfinalmod1.jpg)
గుంటూరు జీజీహెచ్లో నూతన పథకం ప్రారంభించనున్న సీఎం
గుంటూరు జీజీహెచ్లో నూతన పథకం ప్రారంభించనున్న సీఎం
ఇదీ చదవండీ:
'ఇప్పటి దాకా ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి'