రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన సాయంత్రం 5 గంటలకు ప్రజలను ఉద్దేశించి మాట్లడనున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు, ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల సరిహద్దుల మూసివేత వంటి అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి రీ సర్వేకు ప్రజలు సహకరించాల్సిందిగా అభ్యర్ధించనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.
కరోనా వ్యాప్తి నివారణపై నేడు సీఎం జగన్ సమీక్ష - సీఎం జగన్ సమీక్ష వార్తలు
కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ ఇవాళ సాయంత్రం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితులపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కరోనా వ్యాప్తి నివారణపై నేడు సీఎం జగన్ సమీక్ష