మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ ఆయనకు నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని నివాసంలో.... గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. దేశాన్ని స్వేచ్ఛా మార్గంవైపు నడిపించిన గొప్ప నాయకుడు గాంధీ అని సీఎం ట్విట్టర్‌లో కొనియాడారు. అహింస, శాంతి, సర్వోదయ బోధనల వైపు అందరినీ మళ్లించారన్నారు. గాంధీజీ చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని సీఎం సూచించారు.
గాంధీజీ చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలి: సీఎం జగన్ - మహాత్మగాంధీ వర్థంతి వార్తలు
బాపూజీ వర్థంతి సందర్భంగా సీఎం జగన్ ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
cm-jagan-tibutes-to-mahatma-gandhi-in-thadepalli