CM Jagan Review Meeting on Education Department: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్షించారు. పాఠశాల విద్యలోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలని సీఎం ఆదేశించారు. దీనిపై పరిశీలన, అధ్యయనం చేయాలన్నారు. స్టూడెంట్స్ ప్రయోజనాలు నెరవేర్చేలా, మన విద్యావ్యవస్థ అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాలన్నారు. ఏపీలో ఒక విద్యార్థి పదోతరగతి సర్టిఫికెట్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైనదిగా ఉండాలన్నదే లక్ష్యమన్నారు.
శాస్త్రసాంకేతిక, ఆర్థిక, వ్యాపారం, ఇతర రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా ఉండాలని సీఎం సూచించారు. సాధారణ ఆలోచనలతో కాకుండా మెరుగైన ఆలోచనలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే ప్రక్రియ కొనసాగాలన్నారు. నాయకులుగా ఉన్న వ్యక్తులు మార్పులను స్వాగతిస్తూ.. పేద విద్యార్థులకు మంచి జీవితాన్ని అందించాలన్నారు. సులభంగా నేర్చుకునే విధానాన్ని, విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా, వారిలో సృజనాత్మకత పెంచేందుకు నిరంతరం కృషిచేస్తున్నట్లు తెలిపారు.
CM REVIEW ON INCOME DEPARTMENTS: నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి: సీఎం జగన్
విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులకూ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్గించాలని సీఎం సూచించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్ అకడమిక్ కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పైలట్ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.