CM Jagan Start Smart Arogyasri Cards Distribution: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇకపై 25 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికీ రాకూడదనే ఉద్దేశంతో మార్పులు తీసుకువస్తూ ముందడుగు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 3,257 ప్రొసీజర్లను విస్తరించడం సహా పరిమితిని పెంచుతున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీని 2,513 ఆస్పత్రులకు విస్తరించినట్లు తెలిపిన సీఎం జగన్ హైదరాబాద్‌లో 85, బెంగళూరులో 35, చెన్నైలో 16 ఆస్పత్రులకు విస్తరించినట్లు వెల్లడించారు.
ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపు ఆలస్యంపై స్పందించిన మంత్రి
Health Cards Distribution in AP: ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం(YSR Aarogyasri Smart Health Cards) వర్తిస్తుందని, ఈ మేరకు 1.4 కోట్ల కుటుంబాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వివిధ మండల కార్యాలయాల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ (CM Jagan Video Conference) నిర్వహించారు. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా, దీనిపై సేవలు ఎలా పొందాలనే వివరాలను వివరించాలని అధికారులకు సూచించారు. కనీసం ఒకరి ఫోన్లోనైనాఆరోగ్యశ్రీ యాప్ (Aarogyasri App) ను డౌన్లోడ్ చేయించి, రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్దేశించారు.