ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 18, 2023, 10:50 AM IST

Updated : Aug 18, 2023, 11:58 AM IST

ETV Bharat / state

CM Jagan Spoil Youth Future ఫిష్ ఆంధ్రా టూ ఫినిష్ ఆంధ్రా! జగన్ ఆలోచనా విధానంతో ఏపీ భవిష్యత్ అంధకారం!: లోకేశ్

CM Jagan Spoil Youth Future With Fish Andhra: ఫిష్ ఆంధ్రాతో యువత భవిష్యత్తును సీఎం జగన్ ఫినిష్ చేశారని లోకేశ్ ధ్వజమెత్తారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటిన్లను ఆపేసి వారి నోటి దగ్గర కూడు లాగేశారని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో మంగళగిరి నుంచి ఉండవల్లి వరకూ నడిచిన ఆయన.. జగన్ సర్కారుపై సెటైర్లు, విమర్శలు చేస్తూ, వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.

CM Jagan Spoil Youth Future With Fish Andhra
CM Jagan Spoil Youth Future ఫిష్ ఆంధ్రా టూ ఫినిష్ ఆంధ్రా!

CM Jagan Spoil Youth Future ఫిష్ ఆంధ్రా టూ ఫినిష్ ఆంధ్రా!

CM Jagan Spoil Youth Future With Fish Andhra :ప్రజల సమస్యలు వింటూ, వారికి భరోసా ఇస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, సెల్ఫీల ద్వారా వైసీపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (Nara Lokesh Yuvagalam Padayatra) సాగుతోంది. యువగళం పాదయాత్ర 187వ రోజున గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఉండవల్లి వరకూ నడిచారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటిన్లను ఆపేసి.. అన్నార్థుల నోటికాడ కూడు లాగేశారని లోకేశ్ విమర్శించారు. ఫిష్ ఆంధ్రా(Fish Andhra)తో యువత భవిష్యత్తును ముఖ్యమంత్రి ఫినిష్ చేశారని దుయ్యబట్టారు.

YuvaGalam Padayatra in Mangalagiri : నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఉత్సాహంగా సాగుతోంది. మంగళగిరి శివారులోని శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభించి నులకపేట, ప్రకాష్‌ నగర్, తాడేపల్లి మీదుగా ఉండవల్లి వరకు సాగింది. తన నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగారు. కనిపించిన ప్రతి ఒక్కరి బాగోగులు తెలుసుకుంటూ ఆప్యాయంగా మాట్లాడారు.

జగన్ ఊకదంపుడు ఉపన్యాసాలు :వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేలా సెల్ఫీ ఛాలెంజ్​లు విసిరారు. నులకపేటలో తాను ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీను వద్ద స్వీయ చిత్రం తీసుకున్న లోకేశ్‌.. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను ఆపేసినా.. తన సొంత నిధులతో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నట్లు తెలిపారు. పేదలు కడుపునిండా పట్టెడన్నం తింటే ఓర్చుకోలేని జగన్‌ వేదిక దొరికనప్పుడల్లా తాను పేదవాడి పక్షమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు.

Great Memory in Lokesh Padayatra: పాదయాత్రలో అపురూప దృశ్యం.. లోకేశ్​ సాయంతో కుటుంబం నిలబడిందన్న మహిళ

ఫిష్‌ ఆంధ్రా :జగన్‌ రెడ్డి సిద్దాంతం పచ్చి నెత్తురు తాగే ఫ్యాక్షనిజమైతే.. మాది సకల జనులు సుభిక్షంగా ఉండాలనే హ్యూమనిజం అని నారాలోకేశ్‌ వ్యాఖ్యానించారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఫిష్‌ ఆంధ్రా దుకాణం వద్ద సెల్ఫీ తీసుకున్న లోకేశ్.. నేతిబీరలో నెయ్యి లేనట్లే... ఫిష్‌ ఆంధ్రాలో చేపలు కనిపించవని ఎద్దేవా చేశారు.

Jagan Failed To Full Fill Promises to Youth : పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడం చేతకాని జగన్‌ చదువుకున్న ఇలాంటి దుకాణాలు పెట్టించారన్నారు. చంద్రబాబు పాలనలో కియా వంటి కంపెనీలు ఏపీకి వస్తే.. సైకో పాలనలో ఉన్న పరిశ్రమలు తరిమేసి యువత భవితను చీకటిమయం చేశారని దుయ్యబట్టారు. విధ్వంసకుడి ఆరాచకానికి దూరదృష్టి ఉన్న నాయకుడికి తేడా గమనించాలని యువతకు సూచించారు. కృష్ణా నది పక్కనే ఉన్నా తాడేపల్లికి నీరందించలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి నీరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Hello Lokesh Program with Students And Youth: టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్: లోకేశ్

రెడ్లు బాగు పడ్డారు :తాడేపల్లి గేటు కూడలిలో రెడ్డి సామాజికవర్గీయులు లోకేశ్‌ను కలసి సమస్యలు విన్నవించారు. స్పందించిన లోకేశ్‌ సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయని జగన్‌ రెడ్డి.. సామాజిక వర్గానికి ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు. సొంత సామాజికవర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చాక వదిలేశాడని ఆయన అన్నారు. జగన్‌ పాలనలో నలుగురు రెడ్లు మాత్రమే బాగు పడ్డారని ఆరోపించారు.

అడ్డగోలు పన్నులు :న్యూ ఆంధ్రా మోటార్‌ ట్రక్కర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు లోకేశ్‌ను కలసి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. డీజిల్‌ ధరలు పెరగడం భారంగా మారిందని, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంధనధరలు తగ్గించడంతోపాటు అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రవాణా రంగం కుదేలైందని, అడ్డగోలు పన్నుల కారణంగా ట్రక్కు యజమానులు డ్రైవర్లుగా మారే దుస్థితి వచ్చిందన్నారు.

Nara Lokesh Yuvagalm Padayatra: ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల ప్రోత్సాహమే నన్ను నడిపిస్తోంది: నారా లోకేశ్

స్త్రీ శక్తి కార్యక్రమం :తాడేపల్లి ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద స్త్రీ శక్తి ప్రతినిధులు లోకేశ్‌ను కలిశారు. మహిళల ఆర్థిక స్వాలంబనకు టీడీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు స్వయం ఉపాధికి శిక్షణ ఇవ్వడంతో పాటు పనిముట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని హామీ ఇచ్చారు.

కార్యాలయానికి తాళాలు :అగ్నికులక్షత్రియ ఐక్యవేదిక నాయకులు కలిసి స్థానిక మత్స్యకార సొసైటీలకు చెరువులు, ఇసుక రీచ్‌లు నిర్వహించే అవకాశం కల్పించాలని కోరారు. స్పందించిన లోకేశ్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక కులానికి ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి కుర్చీ కూడా ఇవ్వకుండా మోసగించారని ఆరోపించారు. సాక్షాత్తూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పేషీలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా కార్యాలయానికి తాళాలు వేశారని ఎద్దేవా చేశారు.

స్థానికులతో మమేకం :మహిళలు, యువత లోకేశ్‌తో కరచాలనం చేయడానికి, స్వీయ చిత్రాలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. భద్రతను పక్కనపెట్టి స్థానికులతో మమేకమయ్యారు. మంగళగిరి శివారు నుంచి ఉండవల్లి వరకు స్థానికుల కలసి కదం తొక్కగా పాదయాత్ర సాగింది. ఉండవల్లిలోని తన నివాసంలో రాత్రి బస చేశారు.

Nara Lokesh Reveals Love Story with Brahmani: బ్రాహ్మణితో నాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌: లోకేశ్

Last Updated : Aug 18, 2023, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details