వ్యవసాయ మిషన్‌పై సీఎం సమీక్ష కొనసాగుతోంది. రైతు భరోసాపై విస్తృత చర్చ జరుగుతోంది. వ్యవసాయ కళాశాలల్లో ప్రమాణాలు, మిల్లెట్స్ బోర్డు, చక్కెర కర్మాగారాల పునర్ వ్యవస్థీకరణపై సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో పామాయిల్ తక్కువ రికవరీపై అధికారులు సీఎంకు వివరాలు వెల్లడించారు.
వర్షాలు ఆలస్యమైన కారణంగా.. పంటలు దెబ్బతిన్నాయని రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లోనూ పూర్తిస్థాయిలో సాగు కాలేదని వెల్లడించారు. సంక్రాంతి కానుకగా ఎంతో కొంత మొత్తాన్ని ఇవ్వాలని ప్రతినిధులు కోరారు. వీలైతే 2, 3 విడతలుగా ఇచ్చినా అభ్యంతరం లేదని తెలిపారు.