ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలి.. గృహ నిర్మాణాలపై జగన్‌ సమీక్ష

CM JAGAN REVIEW ON HOUSING : టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్​కు అధికారులు తెలిపారు. వెయ్యి ఇళ్లకు పైగా ఉన్నచోట్ల రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిసెంబర్‌ నాటికి లక్షా 10వేల 672 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామన్న అధికారులు.. మార్చి నాటికి మరో లక్షా 10వేల 968 ఇళ్లు అప్పగిస్తామని తెలిపారు.

CM JAGAN REVIEW ON HOUSING
CM JAGAN REVIEW ON HOUSING

By

Published : Oct 26, 2022, 6:13 PM IST

CM JAGAN REVIEW : డిసెంబర్ కల్లా లక్షా 10 వేల 672 టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మార్చి కల్లా మరో లక్షా 10 వేల 968 ఇళ్లు అప్పగించే ఏర్పాట్లు చేయనుంది. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. టిడ్కో ఇళ్లు నిర్వహణ బాగుండాలని.. వాటిని పట్టించుకోకుంటే మురికివాడలుగా మారే ప్రమాదం ఉందన్నారు.

టిడ్కో ఇళ్లలో.. ఇప్పటికే 40వేల 576 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించామని.. వచ్చే ఏడాది మార్చిలోపు మిగిలిన ఇళ్లు పంపిణీ చేస్తామని జగన్​కు అధికారులు వెల్లడించారు. ఫేజ్‌–1కు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు ముగిసిందని తెలిపారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వేయి ఇళ్లకు పైగా ఉన్నచోట్ల రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్, వీధి లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణపై అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details