ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Review Meeting: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై.. అధికారులతో జగన్ సమీక్ష - distributing house sites in capital city area

CM Jagan Review Meeting: పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అమరావతిలో పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధిచి చర్యలు వేగవంతం చేయాలని జగన్ ఆదేశించారు. ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ జవహర్ రెడ్డి సహా సీఆర్డీఎ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM Jagan Review Meeting
జగన్ సమీక్ష

By

Published : May 11, 2023, 7:27 PM IST

House Distribution in capital city area : అమరావతిలో పేదలకు ఇస్తోన్న ఇళ్ల పట్టాల పంపిణీకి వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ జవహర్ రెడ్డి సహా సీఆర్డీఎ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జగన్ పేర్కొన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో గుడివాడలో 8 వేల 912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తున్నామన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రెండో విడతకు సంబంధించి 1 లక్ష 12 వేల 92 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు.

నవరత్నాలు పేదలంరికీ ఇళ్లు పథకంలో భాగంగా అమరావతిలో పేదల కోసం ఇవ్వనున్న ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ చర్యల ప్రగతిపై సీఎం సమీక్షించారు. ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛ నెరవేర్చే బృహత్తర కార్యక్రమన్న సీఎం.. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మొత్తం 21 లే అవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తుండగా.. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జంగిల్‌ క్లియరెన్స్, ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు ముగిశాయని తెలిపారు. దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్‌ రోడ్లు వేసే పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం పూర్తవుతోందని సీఎంకు అధికారులు తెలిపారు. 76 వేల300 చదరపు అడుగులు విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన కూడా జరుగుతోందని వెల్లడించారు. సీఐటీఐఐఎస్‌ కార్యక్రమం కింద దాదాపు 12 అర్భన్‌ ప్రాంతాల్లో ఈ పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

టిడ్కో ఇళ్లపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. టిడ్కో ఇళ్లలో ఫేజ్‌–1 కు సంబంధించి 1 లక్ష 50 వేల ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. 30 ప్రాంతాల్లో 51 వేల 564 ఇళ్లు అప్పగించామని వెల్లడించారు. జూన్‌ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు. రెండో విడతకు సంబంధించిన 1 లక్ష 12 వేల092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. గుడివాడలో 8 వేల912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తున్నామన్న అధికారులు.. జూన్‌ మొదటి వారంలో సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details