CM REVIEW ON EDUCATION : విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. గత సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాలు.. అమలు జరుగుతోన్న వైనం సహా తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చించారు. విద్యారంగంలో నాణ్యమైన విద్యకోసం విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపిన సీఎం.. రాష్ట్రంలో తొలిసారిగా బడులు ప్రారంభమ్యయ్యే తొలిరోజునే విద్యాకానుక కిట్ ఇస్తున్నామన్నారు. వీటన్నింటినీ పిల్లలకు స్కూల్ ప్రారంభించే తొలిరోజే అందిస్తున్నామన్నారు.
మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 'టీచర్స్ కాన్సెప్ట్' సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ పిల్లలకు సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ బోధన అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 45వేల స్కూళ్లను బాగు చేయాలంటే కనీసం 3–4 యేళ్లు పడుతుందన్న సీఎం.. ప్రస్తుతం నాడు - నేడు 15 వేల స్కూళ్లలో జరిగిందన్నారు. ఈ సంవత్సరం మరో 22 వేల స్కూళ్లలోనూ, ఆ తర్వాత సంవత్సరం మిగిలిన స్కూళ్లలోనూ దశల వారీగా జరుగుతుందని.. పనుల పూర్తికి మరో 3–4 సంవత్సరాలు పడుతుందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి క్లాస్‌రూం డిజిటలైజేషన్ కావాలని సీఎం నిర్దేశించారు.