ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YSR Rythu Bharosa: 'వైఎస్సార్​ రైతు భరోసా- పీఎం కిసాన్'​ నిధుల విడుదల

వైఎస్సార్​ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నిధులను సీఎం జగన్‌.. ఈరోజు విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచే రూ.1036 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.

cm-jagan-released-rythu-bharosa-and-pm-kisan-funds
'వైఎస్సార్​ రైతు భరోసా- పీఎం కిసాన్'​ నిధుల విడుదల

By

Published : Jan 3, 2022, 11:53 AM IST

Updated : Jan 3, 2022, 6:45 PM IST

వైఎస్సార్​ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నిధులను సీఎం జగన్‌ నేడు విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచే 50.58 లక్షల మంది రైతులకు.. 1036 కోట్ల రూపాయలను సీఎం జగన్‌ వారి ఖాతాల్లో జమ చేశారు. 'రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా ప్రభుత్వం.. రూ. 13 వేల 500 అందిస్తోంది. తొలి విడతగా పంట వేసేముందు మే నెలలో 7 వేల 500, రెండో విడతగా అక్టోబరులోపు రూ. 4వేలు, మూడో విడతగా సంక్రాంతికి రూ. 2వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న మొత్తంతో కలిపి రూ. 19,813 కోట్ల సాయాన్ని రైతులకు అందించాం' అని రాష్ట్ర సర్కారు తెలిపింది.

Last Updated : Jan 3, 2022, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details