CM jagan launch news pension: రాష్ట్రంలో పెంచిన పింఛన్లను నేడు సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. పెంచిన రూ. 250 పింఛన్ పంపిణీని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్య్సకారులు, తదితరులకు రూ.250 పింఛను పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం వృద్ధులకు ఇస్తోన్న రూ. 2వేల 250కు అదనంగా రూ. 250 పెంచారు. దీంతో లబ్ధిదారులకు రూ. 2,500 అందనుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు.
రూ.1570 కోట్లు విడుదల
రాష్ట్రంలో దాదాపు 62 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. అందుకుగాను ప్రభుత్వం రూ.1570 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శక విధానం అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
ముఖ్యమంత్రి జగన్ సభకు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీఐపీ, ప్రజలు కూర్చునే గ్యాలరీలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చేందుకు రహదారిని నిర్మించారు. హెలీప్యాడ్ నుంచి సభా వేదికకు వెళ్లే ప్రధాన రహదారిలో భద్రత ఏర్పాట్లు చేశారు. హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌లు ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చదవండి...
NEW YEAR CELEBRATIONS : నూతన సంవత్సర వేడుకలకు...సిద్ధమైన విజయవాడ వాసులు