సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం... - సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం వార్తలు
ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు ముఖ్యమంత్రి జగన్ రూ.50 కోట్ల నిధులు కేటాయించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
![సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం... cm jagan photo palabhishekam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7912870-698-7912870-1594035821027.jpg)
ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు సీఎం జగన్ రూ.50 కోట్ల నిధులు కేటాయించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు.. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెదేపా ప్రభుత్వం ఆర్య వైశ్యులను మోసగించి... ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసిందన్నారు. చంద్రబాబు సంక్షేమాన్ని మరిచి నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జగన్ పాదయాత్రలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తామని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. ఆర్యవైశ్యులలో 80% మంది నిరుపేదలు ఉన్నారని..., కార్పొరేషన్ ద్వారా రానున్న రోజుల్లో వారికి మరింత లబ్ధి చేకూరనుందన్నారు.