గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి సీఎం జగన్ ఫోన్ చేశారు. వసతి, భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. జగన్ విజ్ఞప్తిపై విజయ్ రూపానీ సానుకూలంగా స్పందించారు. తెలుగు మత్స్యకారులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వందల మంది మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్తుంటారు. వ్యాపారుల వద్ద పనిచేస్తూ సముద్రంలో చేపలు వేట సాగిస్తుంటారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించటంతో వారంతా ఆ రాష్ట్రంలోని చిక్కుకుపోయారు. రాష్ట్రానికి చెందిన ఏడు వేల మందికి పైగా మత్స్యకారులు అక్కడి ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.