బడుగు, బలహీన వర్గాలు, అణగారిన ప్రజల హక్కుల కోసం.. మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జ్యోతిరావు పూలే వర్దంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ జ్యోతిరావు పూలే పోరాటం చేశారంటూ.. ఆయన సేవలను స్మరించుకున్నారు. బలహీనవర్గాల్లో మహిళలు చదువుకోవాలని ఆరాటపడిన వ్యక్తిగా పూలేను సీఎం జగన్ కొనియాడారు.
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి..నివాళులర్పించిన సీఎం - మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వార్తులు
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. అణగారిన ప్రజల హక్కుల కోసం పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం తెలిపారు. బలహీనవర్గాల్లో మహిళలు చదువుకోవాలని ఆరాటపడిన వ్యక్తి పూలే అని కొనియాడారు.
CM jagan pays tributes